సంగారెడ్డి, (ఆంధ్రప్రభ): ప్రయాగ్ రాజ్ కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా వారణాసి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారి సహా ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయాల పాలయ్యారు. మృతుల్లో ఇరిగేషన్ శాఖ జహీరాబాద్ సబ్ డివిజన్ డీఈ వెంకట్రాంరెడ్డి (42)తో పాటు ఆయన భార్య విలాసిని(40), డ్రైవర్ మల్లారెడ్డి ఉండగా గాయాల పాలైన వారిలో కాలనీకి చెందిన ఓ టీచర్ తో పాటు ఇద్దరు మృతుడి బంధువులున్నారు. ఇక వెంకట్రాం రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి కుంభమేళా వెళ్లారు. ఈ అధికారి కుటుంబంతో సహా సంగారెడ్డి జిమాక్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయన మృతితో నాల్కల్ మండలం గంగ్వార్ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Accident | కుంభమేళాలో రోడ్డు ప్రమాదం – ముగ్గురు జహీరాబాద్ వాసులు దుర్మరణం
