పేదవాన్ని ఆదుకునే పార్టీ అంటే..

పేదవాన్ని ఆదుకునే పార్టీ అంటే..

వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను స్థానిక సర్పంచ్ గుండెం సౌందర్య నవీన్ శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఆమె కూలీలను కలిసి పనుల ప్రాముఖ్యతను వివరిస్తూ పేదవాన్ని అదుకునే పార్టీ అంటే కాంగ్రెస్ అని అన్నారు. పేదల సంక్షేమానికి కట్టుబడి పని చేసిన పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిందన్నారు. ఉపాధి హామీ పథకం అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని అమె వివరించారు. పని ప్రదేశాలలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారం గురించి తెలుసుకున్నారు. ఆయన వెంట, ఉపసర్పంచి స్వామి గౌడ్, పంచాయతీ సెక్రటరీ వీపుల్, ఫీల్డ్ అసిస్టెంట్ గంగాధర్, ఉపాధి హామీ కూలీలు ఉన్నారు.

Leave a Reply