WPL Season 4 | నేటి నుంచే డబ్ల్యూపీఎల్‌ 4వ సీజన్‌

WPL Season 4 | నేటి నుంచే డబ్ల్యూపీఎల్‌ 4వ సీజన్‌

  • మెగా సమరానికి అంతా రెడీ
  • మూడో టైటిల్‌పై కన్నేసిన ముంబై
  • ఈ రోజు ముంబయి వ‌ర్సెస్ బెంగళూరు
  • రాత్రి 7.30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌, జియో హాట్‌స్టార్‌లో లైవ్‌

WPL Season 4 | వెబ్‌డెస్క్ (స్పోర్ట్స్‌), ఆంధ్ర‌ప్ర‌భ : భారత మహిళా క్రికెట్‌ గతిని మార్చిన ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) నాలుగో సీజన్‌కు వేళైంది. 2023లో డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్ జరిగింది. అది సక్సెస్​ అవ్వడంతో ఆ తర్వాత ప్రతి ఎడిషన్​కు ప్రేక్షకుల నుంచి స్పందన లభిస్తోంది. దీంతో స్టేడియాల్లోనూ భారీ సంఖ్యలో ఆడియెన్స్​ కనిపిస్తున్నారు.

అటు ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్, టెలివిజన్ ప్రసారాల్లోనూ లైవ్ చూస్తున్న వాళ్ల సంఖ్య కోట్లలో ఉంటుంది. శుక్రవారం (జనవరి 08) నుంచి ఈ టోర్నీ 4వ సీజన్‌ షురూ కానుంది. శుక్రవారం తొలి మ్యాచ్ ప్రారంభానకి ముందు ఓపెనింగ్ సెర్మనీ ఉండనుంది. సాయంత్రం 6.45 గంటలకు ప్రీ మ్యాచ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని డబ్ల్యూపీఎల్ నిర్వహాకులు తెలిపారు. ఈ ఈవెంట్​లో ఇండియన్ మోడల్, నటి హర్నాజ్ కౌర్ సంధు పాల్గొననున్నారు.

WPL Season 4 | 5 జట్లు మొత్తం 22 మ్యాచ్​లు…

WPL Season 4

2026 మహిళల ప్రీమియర్ లీగ్​కు అంతా సిద్ధమైంది. ఈ టోర్నమెంట్​కు జనవరి 09న తెర లేవనుంది. ఫిబ్రవరి 05న వడోదర వేదికగా జరిగే ఫైనల్​తో ఈ డబ్ల్యూపీఎల్ ముగుస్తుంది. 28 రోజులపాటు ఫ్రాంచైజీ క్రికెట్ మజా అందించేందుకు మహిళా క్రికెటర్లు రెడీ అయిపోయారు. 5 జట్లు మొత్తం 22 మ్యాచ్​లు ఆడుతున్నాయి. ఇటీవల జరిగిన వేలంలో అన్ని జట్లు కూడా పలువురు కొత్త ప్లేయర్లను కొనుగోలు చేసి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి.

WPL Season 4 | తొలి మ్యాచ్ ఎవ‌రి మ‌ధ్య అంటే..?

WPL Season 4

డబ్ల్యూపీఎల్​లో అత్యంత సక్సెస్​ఫుల్ జట్లు ముంబయి ఇండియన్స్ – రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్యే తొలి మ్యాచ్ జరగనుంది. ముంబయి ఈ ఎడిషన్​లో డిఫెండింగ్ ఛాంపియన్స్​గా బరిలో దిగుతోంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సారథ్యంలోని ముంబయి నాట్​సీవర్, అమెలియా కేర్, హీలీ మ్యాథ్యూలతో బలంగా ఉంది. అటు ఆర్సీబీ సైతం పటిష్ఠంగా ఉంది. స్మతి మంధాన, రిచా ఘోష్, నదైన్ డి క్లర్క్, జార్జియా వాల్​ కీలక ప్లేయర్లుగా ఉన్నారు.

WPL Season 4 | ఆ రెండు స్టేడియాల్లో మ్యాచులు

WPL Season 4

ఈసారి డబ్ల్యూపీఎల్ మ్యాచ్​లు నవీ ముంబయి, వడోదర రెండు స్టేడియాల్లో నిర్వహిస్తున్నారు. తొలి దశలో 9 నుంచి 17 దాకా నవీ ముంబయిలో మ్యాచ్​లు ఉండనున్నాయి. తర్వాత జనవరి 19 నుంచి ఫిబ్రవరి 05 దాకా వడోదర మైదానం వేదికగా టోర్నీ సాగుతుంది. ​ మ్యాచ్​లు రోజూ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. వీకెండ్ (ఆదివారం) డబుల్ హెడర్ మ్యాచ్​లు ఉన్నాయి. మధ్యాహ్నం మ్యాచ్​లు 3.30 గంటలకు ప్రారంభం అవుతాయి. అర్ధగంట ముందు టాస్ ఉంటుంది.

WPL Season 4 | లైవ్ ప్ర‌సారం ఎక్క‌డంటే?

WPL Season 4

ఇక ఈ టోర్నీకి ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌, ఓటీటీ ప్లాట్​ఫామ్ జియోస్టార్​ అధికారిక బ్రాడ్​కాస్టర్లుగా వ్యవహరిస్తున్నాయి. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్​కు సంబంధించిన టెలివిజన్ ఛానెల్​లో లైవ్ మ్యాచ్ ప్రసారం అవుతుంది. అలాగే జియోస్టార్​లో లైవ్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే జియోస్టార్​లో ఉచితంగా మ్యాచ్ చూడడం కుదరదు. దీనికి సబ్​స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, జియో తమ యూజర్లకు ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్స్​పై జియోస్టార్ ఫ్రీ సబ్​స్క్రిప్షన్ ఇస్తుంది.

WPL Season 4 | స‌క్సెస్ ఫుల్ జ‌ట్టుగా ముంబై ఇండియ‌న్స్‌

WPL Season 4

డబ్ల్యూపీఎల్​ టోర్నీలో ముండై ఇండియన్స్​ అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది. గడిచిన మూడు సీజన్లలో రెండుసార్లు ముంబయి ఛాంపియన్​గా నిలిచింది. 2023, 2025 ఎడిషన్లలో హర్మన్​ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ముంబయి టైటిల్ దక్కించుకుంది. ఇక 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. అయితే ఈ మూడు సీజన్లలోనూ దిల్లీ క్యాపిటల్స్ ఫైనల్​కు వచ్చింది. కానీ మూడుసార్లు కూడా తుదిమెట్టుపై బోల్తా పడింది. ఈ క్రమంలో ఈసారి ఎవరు టైటిల్ సాధిస్తారో అని ఆసక్తిగా మారింది. మళ్లీ ముంబయి, అర్సీబీల్లో ఒకరు గెలుస్తారా? లేదా కొత్త ఛాంపియన్​ను చూస్తామా? అని అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది.

WPL Season 4

CLICK HERE TO READ ధనాధన్ సమరానికి వేళాయె!

CLICK HERE TO READ MORE

Leave a Reply