Warangal | కత్తితో మహిళ హల్ చల్

Warangal | కత్తితో మహిళ హల్ చల్
- వరంగల్ చౌరస్తాలో టెన్షన్
- భర్త అక్రమ సంబంధం పెట్టు కొన్నాడని ఆందోళన
- షాపులోకి వెళ్లి దాక్కున్న భర్త
Warangal | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : వరంగల్ చౌరస్తాలో వివాహిత మహిళ కత్తితో హల్ చల్ చేశారు. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు నిరసనగా కత్తితో భర్తను వెంటాడి పొడుస్తానని భయ పెట్టింది. భార్య కత్తితో వెంటాడుతుండటంతో దుకాణంలోకి వెళ్ళి తల దాచుకొన్నాడు. తన ఆస్తులు ఆక్రమించి, తనకు దూరంగా ఉంటున్నాడని ఆరోపిస్తూ వివాహిత మహిళ కత్తితో ఆందోళనకు దిగింది. వరంగల్ చౌరస్తాలో జనమంతా చూస్తుండగా జరిగిన సంఘటనతో ఒక్కసారిగా వాతావరణం వేడేక్కింది. వివాహిత మహిళ కత్తితో భర్త అంతు చూసేందుకు దూసుకు రావడంతో చర్చనీయాంశంగా మారింది.
