Rs.36 lakhs | పల్లెల్లో ఆరోగ్య నిలయాలు..

Rs.36 lakhs | పల్లెల్లో ఆరోగ్య నిలయాలు..

  • ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వైద్యసేవలు
  • మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌

Rs.36 lakhs | ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : పల్లెల్లో ఆరోగ్య నిలయాల నిర్మాణంతో వైద్యసేవలు అందుబాటులోకి తేవడంతో పాటు ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని దాములూరు గ్రామంలో రూ.36లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనం (హెల్త్ సెంటర్) నిర్మాణానికి ఎమ్మెల్యే ఈ రోజు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ సెంటర్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను సాధించడం, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడమే ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ప్రధాన లక్ష్యమన్నారు. రూ.9.35 కోట్లతో నియోజకవర్గంలో 29 హెల్త్ సెంటర్ల నిర్మాణాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Rs.36 lakhs |

నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో భవనం పూర్తి చేయాలని ఆదేశించారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), ఎన్డీఏ కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.

Rs.36 lakhs |
Rs.36 lakhs |

Rs.36 lakhs |
Rs.36 lakhs |
Rs.36 lakhs |

CLICK HERE TO READ MORE : CBN Happy  : ఆ కిక్కే వేరబ్బా Andhra Prabha News

CLICK HERE TO READ MORE :

Leave a Reply