R.K.Roja | ఏపీ పోలీసులు సిగ్గుపడాలి…

R.K.Roja | ఏపీ పోలీసులు సిగ్గుపడాలి…
రోజా కీలక వ్యాఖ్యలు
R.K.Roja | నెల్లూరు, ఆంధ్రప్రభ : ఏపీ పోలీసులపై మాజీ మంత్రి ఆర్ కే రోజా (R.K.Roja) కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ… దేశంలో అట్టడుగు స్థాయిలో ఏపీ పోలీస్ శాఖ ఉందన్నారు. పోలీస్ వ్యవస్థను చూసి అందరూ నవ్వుతున్నారన్నారు. పోలీసులు (police) నీళ్లు లేని బావిలో దూకి చావాలన్నారు. చంద్రబాబు, అనిత కూడా కేంద్ర నివేదికను చూసి సిగ్గుపడాలన్నారు. కూటమి ప్రభుత్వం రాయలసీమకు తీరని ద్రోహం చేస్తుందన్నారు. ఇంత జరుగుతుంటే పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు.
