Water purifier | సమాజ సేవతోనే సంతృప్తి

Water purifier | సమాజ సేవతోనే సంతృప్తి
- సర్పంచ్ నలిమేల రాజు
Water purifier | లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : సమాజ సేవతోనే సంతృప్తి లభిస్తుందని వెంకట్రావ్ పేట్ సర్పంచ్ నలిమేల రాజు అన్నారు. ఈ రోజు వెంకట్రావ్ పేట్ సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ పాఠశాలలకు బెంచ్ లు, వాటర్ ఫ్యూరిఫైయర్(Water purifier) బహుకరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… సమాజంలో విద్య ద్వారానే మార్పు సాధ్యమన్నారు. క్రమశిక్షణ, వినయ శీలత కలిగిన విద్యార్థులే భవిష్యత్ లో ఉత్తమ పౌరులుగా రాణించి సమాజానికి మేలు చేస్తారని వివరించారు. సేవా భావం చిన్నతనం నుంచే అలవర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా వెంకట్రావ్ పేట్ సేవా సమితి(service set) కార్యక్రమాలు పేదలకు ఎంతగానో మేలు చేస్తున్నాయని తెలిపారు. మానవ సేవే మాధవ సేవగా భావించి సమితి సభ్యులు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

అంతకుముందు సేవా సమితి అధ్యక్షులు ఇండ్ల రమేష్ మాట్లాడుతూ… సమాజానికి సేవ చేస్తే తమకు ఏదో ఒకరోజు, ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. సమాజం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్నారు. పలువురు దాతల సహకారంతో రూ. 2 లక్షల 25 వేల విలువ గల డెస్క్ బెంచీలను(desk benches), వాటర్ ఫ్యూరి ఫైయర్ ను ఉన్నత, ప్రాథమిక పాఠశాలలకు సమితి ఆధ్వర్యంలో అందించమన్నారు.
అనంతరం సావిత్రి భాయ్ ఫూలే జయంతిని పురస్కరించుకొని పాఠశాలల మహిళల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ మెంబర్ శ్రీనివాస్, ఎంపీడీఓ సరోజ, ఏంఈఓ శైలజ, ఎస్సై సురేష్, మీస శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
