Tragedy | న్యూ ఇయర్‌ వేడుకల్లో విషాదం

Tragedy | న్యూ ఇయర్‌ వేడుకల్లో విషాదం

మద్యం తాగి, బిర్యానీ తిని.. ఒకరు మృతి, 15 మందికి అస్వస్థత


Tragedy | హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో విషాద ఘటన (Tragedy) చోటుచేసుకుంది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీనగర్‌లో 17 మంది స్నేహితులు కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ (New Year Celebrations) నిర్వహించుకున్నారు. మద్యం సేవించి, బిర్యానీ తిన్న తర్వాత వారు అస్వస్థతకు గురయ్యారు.

ఈ ఘటనలో పాండు (Pandu) (53) అనే వ్యక్తి మృతి చెందాడు. మిగతా 15 మంది అపస్మారక స్థితికి చేరుకోవడంతో వెంటనే నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఫుడ్ పాయిజనింగ్ (Food poisoning) లేదా మద్యం అధిక మోతాదు కారణంగా ఈ ఘటన జరిగి ఉంటుందని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పోలీసులు (police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా జరిగిన ఈ దారుణ ఘటన నగరవాసులను కలచివేసింది.

Leave a Reply