Minority | అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం..

Minority | అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం..

న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్

Minority | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎండి. ఫరూక్ శనివారం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరికీ సమాన విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం, భావ ప్రకటనకు సమ న్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారతపిత అని కొనియాడారు. సమ సమాజ నిర్మాణంలో బాబాసాహెబ్ చేసిన కృషికి గుర్తింపుగా ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి సైతం ఆయన్ను “సింబల్ ఆఫ్ నాలెడ్జ్”గా గుర్తించాయన్నారు.

అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడానికి తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చెరుకు శ్రీదేవి, పిచ్చికే నాగార్జున, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సుమలత, జెపి, బ్యాంకు తిమ్మయ్య, మాజీ కౌన్సిలర్లు దేవరపాటి రవికుమార్, కొండారెడ్డి టీడీపీ కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి, కామణి మల్లికార్జున, బింగుమల్ల శ్యామ్ సుందర్ గుప్తా, మిద్దె ఉసేని, త్రిలింగేశ్వర్ రెడ్డి, రంగ ప్రసాద్, ఓబుల్ రెడ్డి, అలీమ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply