Sai Reddy | అభివృద్ధి కోసం మరొక్కసారి గెలిపించండి

Sai Reddy | అభివృద్ధి కోసం మరొక్కసారి గెలిపించండి


Sai Reddy | చందూర్, ఆంధ్రప్రభ : మరొక్కసారి గ్రామ అభివృద్ధి కోసం తనను గెలిపించాలని చందూర్ సర్పంచ్ అభ్యర్థి కర్లం సాయిరెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. ఎమ్మెల్యే (MLA) పోచారం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో నూతన మండలాన్ని సాధించుకొని వారి ఆశీస్సులతో నేను గత 5 సంవత్సరాలలో విద్య, వైద్యం తాగునీరు, పారిశుద్ధ్యం,సాగునీరు నూతన ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, రోడ్లు, కుల సంఘాల భవనాలు, ఇందిరమ్మ ఇండ్లు, ఇలా అనేక రంగాల్లో చందూర్ గ్రామ అభివృద్ధికి పాటుపడ్డానన్నారు.

అనునిత్యం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేశాను. ఇక ముందు కూడా రెట్టింపు అభివృద్ధితో చందూర్ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నన్ను దీవించి, మీ అమూల్యమైన ఓటును ఫుట్ బాల్ గుర్తుకు ఓటు (VOTE) వేసి చందూర్ గ్రామ అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నాను.

Leave a Reply