Panchayat | గ్రామాభివృద్ధే లక్ష్యం

Panchayat | గ్రామాభివృద్ధే లక్ష్యం

  • కామరం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా సావిత్రి


Panchayat | తాడ్వాయి, ఆంధ్రప్రభ : కామరం గ్రామ పంచాయతీ అభివృద్ధి తన లక్ష్మమని తాడ్వాయి మండలం కామరం గ్రామ కాంగ్రెస్ (Congress) పార్టీ అభ్యర్థి కోర్నిబెల్లి సావిత్రి జగన్ అన్నారు. శుక్రవారం స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటిటీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రి మాట్లాడుతూ… గ్రామాభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే విశ్వాసం, మద్దతుతో గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గ్రామ ప్రజలతో కలిసి గ్రామాభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

గ్రామాభివృద్ధి దిశగా తాను చేసిన ప్రణాళికలను అమలు చేయడానికి ప్రజల ఆశీర్వాదం అవసరమని కోరారు. యువతలో ఉన్న ఉత్సాహం, గ్రామాభివృద్ధిపై ఉన్న అభిరుచి తనను ఎన్నికల రంగంలోకి తీసుకువచ్చిందని తెలిపారు. గ్రామాన్ని ఆద‌ర్శంగా తీర్చిదిద్దడానికి కష్టపడి పనిచేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. మీ అమూల్యమైన ఓటును త‌న‌కు కేటాయించిన‌ గుర్తుపై వేసి త‌న‌ను ఆశీర్వదిస్తారని వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మార్కెట్ (Market) కమిటీ చైర్ పర్సన్ రెగ కళ్యాణి, లష్మినారాయణ, రవీ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply