MLA | పేద ప్రజలకు అండగా..

MLA | పేద ప్రజలకు అండగా..
MLA | పామర్రు, ఆంధ్రప్రభ : పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తుందని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. పామర్రు టౌన్ లో పెందుర్తి భువనేశ్వరికి రూ.24,866 చెక్కును, సమ్మంగి శ్రీనివాసరావుకి రూ.88,729 చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
