TG | ఎన్నికల పంచాయతీ..

TG | ఎన్నికల పంచాయతీ..
TG, ఎడపల్లి, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం గురువారంతో మొదలు కావడంతో ఎడపల్లి మండల వ్యాప్తంగా గ్రామాలలో సందడి వాతావరణం నెలకొంది. మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు (panchayat elections) గాను 9 నామినేషన్ పత్రాల స్వీకరణ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 27వ తేదీన ప్రారంభమైన నామినేషన్ స్వీకరణ ప్రక్రియ 29వ తేదీ సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. ఎడపల్లి మండల వ్యాప్తంగా గురువారం 9 మంది సర్పంచులు, 7 వార్డు సభ్యులకు గాను నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీఓ శంకర్ తెలిపారు.
ఎడపల్లి మండలంలోని మంగళ్ పహాడ్ గ్రామానికి చెందిన చేపూరి వీణ శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ దాఖలు చేయగా, ఎమ్మెస్సీ ఫారం నామినేషన్ కేంద్రంలో బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వినీష్ రెడ్డి, ఎమ్మెస్సీ ఫారం గ్రామానికి చెందిన నోముల జయశ్రీ, శ్రీనివాస్ గౌడ్, జైతాపూర్ నామినేషన్ పత్రాల స్వీకరణ కేంద్రంలో పోచారం గ్రామానికి చెందిన నీరడి జ్యోతి, రవి కుమార్, ఏ.ఆర్పి క్యాంప్ నామినేషన్ పత్రాల స్వీకరణ కేంద్రంలో అంబం(వై) గ్రామానికి చెందిన సున్నపు లత, ఓడెన్న, సర్పంచ్ అభ్యర్థులుగా తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. అలాగే పలు గ్రామాలకు చెందిన వార్డు సభ్యుల అభ్యర్థులు సైతం తమ నామినేషన్లను దాఖలు చేశారు.

కాగా మండలం లోని 17 గ్రామపంచాయతీలతో పాటు 166 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల మేరకు అంబం(వై) బీ.సీ మహిళ, ఏ.ఆర్. పీ క్యాంప్ అన్ రిజర్వ్డ్, బాపునగర్ ఎస్సీ మహిళ, బ్రాహ్మణపల్లి అన్ రిజర్వ్డ్, ధర్మారం అన్ రిజర్వ్డ్, దుబ్బా తండా ఎస్.టీ, జైతాపూర్ బీ.సీ, జమ్లం బీ.సీ, జానకంపేట్ అన్ రిజర్వ్డ్ మహిళ, కూర్నపల్లి బీ.సీ, మంగళ్ పహాడ్ అన్ రిజర్వ్డ్ మహిళ, ఎమ్మెస్సీ ఫారం అన్ రిజర్వ్డ్ మహిళ, నెహ్రూనగర్ బీ.సీ మహిళ, పోచారం అన్ రిజర్వ్డ్ మహిళ, ఠాణాకలాన్ బీ.సీ మహిళ, వడ్డేపల్లి ఎస్సీ, ఎడపల్లి అన్ రిజర్వ్డ్ గా రిజర్వేషన్లు ఇది వరకే ఖరారు అయ్యాయి.
ఎడపల్లి మండలంలో మొత్తం 17 గ్రామ పంచాయతీలకు గాను నామినేషన్ పత్రాల స్వీకరణ కేంద్రాలుగా ఏఆర్పి క్యాంప్, ఎమ్మెస్సీ ఫామ్, జైతాపూర్, జాన్కంపేట్, నెహ్రూనగర్, ఠాణాకలాన్, కూర్నపల్లి,మంగళ్ పహాడ్, ఎడపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాలలో నామినేషన్ పత్రాల స్వీకరణ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు అన్ని కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎడపల్లి ఎస్సై రమ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో అన్ని గ్రామాల ప్రజలు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకుండా ఉండాలని ఎస్సై సూచించారు.
