68 years | ముదిరాజ్ జెండా రెపరెపలాడాలి…

68 years | ముదిరాజ్ జెండా రెపరెపలాడాలి…
68 years | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో గోడపత్రిక ఆవిష్కరణ విజయవంతంగా జరిగింది. నవంబర్ 21న(On November 21st) జరగనున్న తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర యువజన కార్యదర్శి గోరంట్ల యాదగిరి ముదిరాజ్(Gorantla Yadagiri Mudiraj) ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముదిరాజ్ మహా సభ జనగాం జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య ముదిరాజ్ గోడ పత్రికను ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు. 2014 నవంబర్ 21న తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డా. బండ ప్రకాశ్ ముదిరాజ్(Dr. Banda Prakash Mudiraj) అధ్య క్షతన తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఏర్పడి కేవలం 11ఏళ్లలోనే ముదిరాజ్ సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారా లను సాధించిందని పేర్కొన్నారు.
గత 68 సంవత్సరాల్లో(last 68 years) కనిపించని స్పష్టమైన మార్పులను తెలంగాణలో ముదిరాజ్ మహాసభ తీసుకువ చ్చిందని తెలిపారు. ముదిరాజ్ జాతి ఐకమత్యం అత్యవసరమని, ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు, సంబరాలతో నవంబర్ 21న 11వ వార్షికోత్సవం(11th anniversary), ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జనగాం జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్ భూర్ల శంకర్, శివునిపల్లి మత్స్య పారిశ్రామి క సహకార సంఘం ప్రధాన కార్యదర్శి చెన్నూరి వెంకటేశ్వర్లు, ముదిరాజ్ కుల నాయకులు చిక్కుడు రమేష్, కొండ వేణు, పిట్టల శంకర్, బూర్ల కొమురయ్య, ఈశ్వర్, శివలింగం, అనిల్, తిరుపతి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
