Kadiam Kavya | సంక్షేమ పథకాలు సక్రమంగా అందించాలి

Kadiam Kavya | సంక్షేమ పథకాలు సక్రమంగా అందించాలి

కేంద్ర నిధులు సకాలంలో వినియోగించాలి
దిశా సమీక్షలో ఎంపీ డా. కావ్య


Kadiam Kavya | ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా.కడియం కావ్య (Dr. Kadiam Kavya) అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం డిస్టిక్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ( దిశా ) సమావేశం ఎంపీ డా. కడియం కావ్య అధ్యక్షతన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు (Gandra Satyanarayana Rao), జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రజలకు అందిస్తున్న సేవల పురోగతి పై ఆయా శాఖల అధికారుల ద్వారా సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాకు ఆరోగ్య శాఖకు రూ.9 కోట్ల నిధులు రాగా కేవలం రూ. 5 కోట్లు మాత్రమే ఖర్చు చేయడంతో నిధులు తిరిగి వెళ్తాయని ఎంపీ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు లు సంబంధిత డిఎంఎచ్ ఓ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్,విజయలక్ష్మి, మయాంక్ సింగ్ , గండ్ర నవీన్ రెడ్డి, జెన్కోసిఈ శ్రీ ప్రకాష్, డిఆర్ డి ఓ పిడి బాలకృష్ణ, జిల్లా గ్రంధాలయ చైర్మన్ కోట రాజబాపు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply