HYD | శివ పంచాయతన ఆలయంలో…

  • వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం
  • ప్రత్యేక పూజలు చేసిన జంపన, భక్తులు

కంటోన్మెంట్, ఆంధ్రప్రభ: కంటోన్మెంట్‌లోని 6వ వార్డులోని బోయిన్‌పల్లి సీతారాంపురం కాలనీలోని శివ పంచాయతన హనుమాన్ ఆలయంలో శనివారం వెంకటేశ్వర స్వామి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది.

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంపన ప్రతాప్ హాజరై స్వామి కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కళ్యాణ మహోత్సవంలో.. స్థానికులు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక సంతరించుకొని పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు సాయి బాబా యాదవ్, సురేష్, విజయ్ బాబు, శ్రీధర్, రాజు తో పాటు తదితరులు పాల్గొని అన్న వితరణ చేశారు.

Leave a Reply