gangaram | విద్యుత్ షాక్.. బాలుడికి గాయాలు

వికారాబాద్ రూరల్, ఆంధ్రప్రభ : మున్సిపల్ పరిధిలోని గంగారం (gangaram) ప్రాథమిక పాఠశాల బయట రక్షణ కంచె లేని 33 కెవి ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదాన్ని కలిగించింది. బుధవారం మధ్యాహ్నం మూడవ తరగతి విద్యార్థి వంశీ భోజనం చేయడానికి పాఠశాల బయటకు వచ్చిన సమయంలో పాఠశాల ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ (transformer) వైర్లు తగిలి చేతులు, కాళ్లు కాలడటమే కాకుండా తలకు తీవ్ర గాయాలయ్యాయి. ముక్కు నుంచి రక్తం రావ‌డంతో బాలుడిని స్థానికులు, పాఠశాల సిబ్బంది తక్షణమే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ డాక్టర్లు (Doctors) లేకపోవడంతో, చిన్న పిల్లలకు సదుపాయాలు లేని స్థితితో మండల అధికారితో మాట్లాడి ప్రైవేట్ ఆసుపత్రికి మార్చారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి విషమంగానే ఉంది. సంఘటనపై పాఠశాల సిబ్బంది, స్థానికులు కలెక్టర్‌ను సంప్రదించి, విద్యార్థికి తక్షణ మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటన పాఠశాలల సమీపంలో విద్యుత్ సామగ్రి భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది.

Leave a Reply