టెన్షన్ పెడుతున్న ట్రాన్స్ఫార్మర్..

టెన్షన్ పెడుతున్న ట్రాన్స్ఫార్మర్..
దండేపల్లి, ఆంధ్రప్రభ : ప్రమాదం పొంచి ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను తొలగించండని కరెంటు అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా కొంచెం కూడా కనకరించడం లేదని ఆవేదన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. దండేపల్లి మండలంలోని మెదరిపేట గ్రామానికి చెందిన ఎస్ కె సర్దార్ ఇంటి ముందు గత కొన్ని సంవత్సరాల క్రితం కరెంటు అధికారులు ట్రాన్స్ఫార్మర్ బిగించారు. అప్పటి నుండి ఎస్ కె సర్థార్ అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు.
దీంతో ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయి వేరే ఇంట్లో అద్దెకు ఉండవాల్సి వచ్చిందన్నారు. అక్కడే సైకిల్ రిపేర్ దుకాణం పెట్టుకుని జీవనోపాధి పొందుతున్నానని అన్నారు. అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ శిథిలావస్థలో ఉండడంతో బిక్కుబిక్కుమంటూ భయంతో ఉంటున్నామని అక్కడ సైకిల్ దుకాణం తీసేస్తే కుటుంబ పోషణ ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి, అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ తొలగించి బాధితున్ని ఆదుకోవాలని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
