మాలాధారణ స్వాములకు అన్నప్రసాద వితరణ
మిర్యాలగూడ, ఆంధ్రప్రభ : అయ్యప్పమాలాదారుల సేవలో తాను తరిస్తానని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(Bathula Lakshma Reddy) తెలిపారు. రేపటి నుంచి అయ్యప్ప మాలాదారణ చేసే భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేస్తానని చెప్పారు. మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం నుంచి నియోజకవర్గంలోని మాలాదారులందరూ భిక్ష చేసే విధంగా మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఈ రోజు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఆయన భార్య మాధవి ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు(Congress Party leader) దేశిడి శేఖర్ రెడ్డి, గుడిపాటి నవీన్ లు తెలిపారు.
మిర్యాలగూడ(Miryalaguda) నియోజకవర్గంలోని స్వాముల మాలాదారులందరూ 42 రోజులపాటు నిర్వహించే మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ముక్కపాటీ వెంకటేశ్వరరావు, గోదాల జానకిరామ్ రెడ్డి లు ఉన్నారు.