వినియోగించుకున్న ప్ర‌జ‌లు

వినియోగించుకున్న ప్ర‌జ‌లు

కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి మండల కేంద్రంలో నిజామాబాద్(Nizamabad) మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ రోజు గ్రామపంచాయతీలో ఉచిత వైద్య శిబిరాన్ని(free medical camp) నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆశిష్(Dr. Ashish) మాట్లాడుతూ.. ఉచిత వైద్య శిబిరానికి సుమారు 60 నుండి 70 మంది వచ్చినట్లు తెలిపారు.

వారికి బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఈ. గంగ జమున(E. Ganga Jamuna), స్టాఫ్ నర్స్ స్వరూప, రవి, మోహన్, హెచ్డిఎఫ్ ఏర్గోసి మేనేజర్ రాజ గంభీర్, అసిస్టెంట్ మేనేజర్ సదాశివ్, సీనియర్ అడ్వైజర్స్ కొమ్ముల శ్రీనివాస్, పెంబర్తి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply