దరఖాస్తుల వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలి
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : తహసీల్దార్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వీ(Abhigyan Malvi) ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసిల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి కార్యాలయానికి సంబంధించిన వివరాలను తహసీల్దార్ జి. ప్రసాద్(G. Prasad)ను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయాన్ని మొత్తం కలియ తిరుగుతూ సిబ్బందితో మాట్లాడారు.
కార్యాలయంలో భద్రపరిచిన రికార్డులు, వీడియో కాన్ఫరెన్స్(Video Conference) గదిని పరిశీలించారు. రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలని, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. సాంకేతిక సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే జిల్లా కార్యాలయ సిబ్బందితో మాట్లాడి సరి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శరత్(RI Sarath), రెవెన్యూ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

