సమస్యల పరిష్కారానికి కృషి
సమస్యల పరిష్కారానికి కృషి
- మంత్రి పయ్యావుల కేశవ్
అనంతపురం బ్యూరో, అక్టోబర్ 8 (ఆంధ్ర ప్రభ) : ఉరవకొండ నియోజకవర్గ (Uravakonda constituency) కేంద్రంలోని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కార్యాలయంలో బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు, నాయకుల నుంచి మంత్రి పయ్యావుల కేశవ్ అర్జీలను స్వీకరించారు. ఈ ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్ వివిధ రకాల ప్రజా సమస్యలపై ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Paiyavula Keshav) మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు లాంటివని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు (Welfare schemes) అందజేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా మంత్రి నలుమూలల నుంచి వచ్చిన బాధితులు, నాయకులు, ప్రజలు సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించి, ఎలాంటి ఆలస్యం కాకుండా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తక్షణం చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
