8 మంది ఐపీఎస్ ల జాబితా రెడీ..

  • సర్కారు నోటిఫికేషన్ జారీ
  • లిస్ట్ లో పీవీ సునీల్ కుమార్.. పీతారామాజనేయులు

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఎనిమిది మంది ఏపీ కేడర్‌ ఐపీఎస్ (IPS) ఆఫీసర్ల రిటైర్ మెంట్ కు షెడ్యూల్‌ను ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

ఈ అధికారులు 2026 సంవత్సరంలో సూపర్‌ యాన్యుయేషన్ వయస్సుకు చేరుకున్న తర్వాత ఉద్యోగ విరమణ చేయనున్నారు.

ఈ జాబితాలో 1990 నుంచి 1994 వరకు రెగ్యులర్ రిక్యూ ట్ (R.R) బ్యాచ్‌ల్లోని సీనియర్ అధికారులు, స్టేట్ పోలీస్ సర్వీస్ (SPS) నుంచి ఐపీఎస్‌గా పదోన్నతి పొందిన అధికారులు ఉన్నారు.

వీరిలో అంజనీ కుమార్ (RR:1990), జి. పాలరాజు (SPS:2005) ఉన్నారు. వీరు జనవరి 31, 2026న పదవీ విరమణ చేయనున్నారు. మాదిరెడ్డి ప్రతాప్ (RR:1991), పి.వి.సునీల్ కుమార్ (RR:1993) ఇద్దరూ 2026 జూన్ 30 న ఉద్యోగ విరమణ చేయనున్నారు.

ఈ నోటిఫికేషన్‌లో కాశీ రెడ్డి వి.ఆర్.ఎన్. రెడ్డి (RR:1992), పి. సీతారామ ఆంజనేయులు (RR:1992), కె.ఎస్.ఎస్.వి. సుబ్బారెడ్డి (SPS:2015), ఎన్. బాల సుబ్రమణ్యం (RR:1994) పేర్లు కూడా ఉన్నాయి. 2026లో వరుసగా ఏప్రిల్, ఆగస్టు, మార్చి, అక్టోబర్ నెలల్లో వీరు ఉద్యోగ విరమణ చేస్తారు. ఈ మేర‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply