అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
విజయనగరం, అక్టోబర్ 7(ఆంధ్ర ప్రభ) : శ్రీ పైడితల్లి అమ్మవారి (Sri Paidithalli Ammavaru) ని దర్శించుకునేందుకు భక్త జనులు బారులు తీరారు. మంగళవారం వేకువ జామునుండే అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి చేరుకున్నారు. మొక్కలు చెల్లించుకోవడంలో భాగంగా పలువురు అమ్మవారికి ఘటాలు సమర్పించారు.

మరోవైపు గోవా గవర్నర్, మన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ( Ashok Gajapathi Raju) కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అదే విధంగా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, కలెక్టర్ ఎస్.రామ్సుందర్ రెడ్డి తదితరులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, భక్తుల దర్శనాల కోసం అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. విచిత్ర వేషధారణలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది.



