14 రోజుల హుండీ ఆదాయం ఎంతంటే…

- అమ్మకు భక్తి, ప్రేమతో బంగారం వెండితో పాటు విలువైన డాలర్లు బహూకరణ…
- ఈవో శీనా నాయక్ ఆధ్వర్యంలో
- 14 రోజులకు గాను 48 హుండీల లెక్కింపు…
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే రెండో అతిపెద్ద దేవాలయమైన విజయవాడ(Vijayawada) లోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ (Kanaka Durgamma) వారికి భక్తులు కానుకుల వర్షం కురిపించారు. నిత్యం వేల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు అమ్మవారికి భక్తి, ప్రేమతో వివిధ రూపాలలో కానుకలను సమర్పిస్తుంటారు.
ఆలయ ప్రాంగణంలోని మహామండపం ఆరవ అంతస్తులో ఈవో శీనా నాయక్ (Sheena Naik) ఆధ్వర్యంలో గురువారం గడిచిన 14 రోజులకు గాను ఆలయంలోని 48 హుండీలను అధికారులు లెక్కించారు. హుండీలు తెరిచి లెక్కించగా అందులో రూ.2,17,98,528/- నగదు, బంగారం 235 గ్రాములు, వెండి కేజీ 3-970 గ్రాములు భక్తులు అమ్మవారికి కానుకల రూపంలో సమర్పించుకున్నారు.

అలాగే దేశ విదేశాలకు చెందిన భక్తులు అమ్మవారికి విదేశీ కరెన్సీ (Foreign currency) ని కూడా కానుకల రూపంలో చెల్లించారు. వీటిలో పలు దేశాల విదేశీ కరెన్సీ వచ్చియున్నవి. యు.ఎస్.ఎ 321 డాలర్లు, సింగపూర్ డాలర్లు -10, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్స్- 35, సౌదీ రియాల్స్-25, ఒమన్ బైసా – 200, ఖతార్రియాల్స్ – 24, మలేషియా రింగిట్- 2, యూరోప్యూరోలు – 65, కువైట్ దీనార్-5.1/2, హాంగ్‌కాంగ్ డాలర్లు- 500, థాయిలాండ్ బాట్ – 40, బహ్రెయిన్ దీనార్ – 11 లు ఉన్నాయి. ఈ హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బంది, అధికారులు, వన్ టౌన్ పోలీస్ సిబ్బంది, ఎస్పీఎఫ్ సిబ్బందితో పాటు పర్యవేక్షణ అధికారులు పాల్గొన్నారు.
