ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని వెల్లడి
దర్యాపు కొనసాగుతున్నదని వివరణ
ప్రభుత్వ విచారణ నివేదిక కోసం ఎదురుచూస్తామన్న సిగాచీ
3 నెలల వరకూ ప్లాంట్లో కార్యకలాపాలు నిలిపిత
మృతుల కుంటుంబాలకు ఒక్కొక్కరికి రూ .కోటి
గాయపడిన వారికి సైతం రూ.10 లక్షల నుంచి కోటి వరకు సాయం
గాయపడినవారికి పూర్తి వైద్యమందిస్తామని ప్రకటన
ప్రమాదంపై సాక్ట్మార్కెట్లకు లేఖ రాసిన కంపెనీ సెక్రటరీ
బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటన
పటాన్ చెరు .. పాశమైలారంలోని సిగాచీ ఫార్మా (Sigachi Pharma) పరిశ్రమ ప్రమాదంపై తొలిసారిగా ఆ సంస్థ పెదవి విప్పింది.. ఈ ప్రమాదం రియాక్టర్ పేలుడు (reactor blast ) వల్ల జరగలేదంటూ సీగాచీ తరఫున కెంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ (Secretary vivek kumar ) నేడు ఒక ప్రకటన విడుదల చేశారు.. ప్రమాదంపై ప్రభుత్వం (governament ) దర్యాప్తు జరుపుతున్నదని, త్వరలోనే కారణాలు తెలుస్తాయని ఆయన వెల్లడించారు. ఇక ఈ ప్రమాదంలో మొత్తం 40 మంది మృతి (40 persons died) చెందినట్టు తెలిపారు. 33మంది (33 persons injured ) గాయపడ్డారని పేర్కొన్నారు.. గాయపడిన వారికి చికిత్స కొనసాగుతున్నదని చెప్పారు. మృతదేహాల గుర్తింపు కార్యక్రమం జరుగుతున్నదని, అయిన తర్వాత వాటిని సంబంధిత బంధువులకు అందజేస్తామని తెలిపారు.. ఇక మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరి రూ.1కోటి పరిహారం ఇస్తామని అధికారికంగా ప్రకటించారు.. గాయపడిన వారికి సైతం రూ.10 లక్షల నుంచి కోటి రూపాయిల వరకు ఆర్థికసాయం చేస్తామన్నారు.. అలాగే గాయపడిన వారందరూ కోలుకుని ఇంటికి తిరిగి వెళ్లే వరకు అన్ని వైద్య ఖర్చులు కంపెనీ భరిస్తుందన్నారు.. బాధిత కుటుంబాలకు కంపెనీ సంపూర్ణంగా అండగా ఉంటుందని చెప్పారు.
మూడు నెలలు కంపెనీ మూత
ఈ ప్రమాద నేపథ్యంలో మూడు నెలల పాటు ఫ్యాక్టరీ కార్యకలాపాలు నిలిపివేస్తునట్లు వివేక్ కుమార్ తెలిపారు.. ఇదే విషయాన్ని స్టాక్ మార్కెట్ కు లేఖ కూడా రాసినట్లు వెల్లడించారు.