People-Cm : కుప్పం అందరివాడు Andhra Prabha Top Stiry
People-Cm : కుప్పం అందరివాడు Andhra Prabha Top Stiry
- మూడో రోజు పర్యటనలో
- ఊరూర బాబు సందడి
- పార్టీ నేతల ఇళ్లల్లో పలకరింపులు
- చిన్నారులతో ముచ్చట్లు
(ఆంధ్రప్రభ, చిత్తూరు బ్యూరో)
People-Cm : 37 ఏళ్ల రాజకీయ అనుబంధంతో కుప్పం నియోజక వర్గం ప్రజల్లో ఆత్మీయనాయకుడిగా… అందరివాడుగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తానం కొసాగటుతున్న వేళ.. ఈసారి కుప్పంలో ఓ పండుగ వాతావరణం నెలకొంది.
కుప్పం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెంగాచారి ఇంటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లారు. కడపల్లిలోని తన నివాసం నుంచి కుప్పం కుప్పవెళ్తున్న సమయంలో చెంగాచారి కోరిక మేరకు శాంతిపురంలోని ఆయన ఇంటికి వెళ్లారు. చెంగాచారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. కుటుంబ సభ్యుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. చెంగాచారి కుటుం భ్యులు అందించిన స్వీటునును రుచి చూశారు. అంతకముందు తన నివాసం వద్దకు వచ్చిన కుప్పం వాసుల నుంచి వినతులు అందుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. చిన్నారులను ఎత్తుకుని ఆడించారు.
