మైనార్టీ రెసిడెన్షియల్ ముందు బిఆర్ఎస్ ఆందోళన..

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పాఠశాల నిర్వాహకులు కారంతో కూడిన భోజనాన్ని వడ్డీస్తున్నారని ఆరోపిస్తూ మాజీ ఉమ్మడి జిల్లా వైస్ చేర్మెన్ మూల రాజీరెడ్డి బిఆర్ఎస్ నాయకులు పాఠశాలముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా రాజి రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని, గురుకుల పాఠశాలలకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టిస్తు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు.

చెన్నూరు పట్టణంలోని గురుకలలో పరిస్థితి దయానియంగా మారిందని విద్యార్థులకు అందివాల్సిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందివాల్సిన ప్రభుత్వ అధికారులు గొడ్డుకారం వడ్డీస్తూన్నారని, ఉన్నత అధికారుల పర్యవేక్షణ లేక విద్యార్థులు గురుకులాలు వదిలి పారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా స్థానిక సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థి మృతి చెందిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి వివేక్ వెంకటస్వామి కనీసం బాధిత కుంటుంబాన్ని ప్రేమర్శించలేదని ఆరోపించారు గురుకులాల్లో జరిగే దారుణలపై ప్రభుత్వ అధికారులు స్పందించక పొతే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హేచ్చరించారు.