సంగారెడ్డి, ఏప్రిల్ 16 (ఆంధ్రప్రభ) : సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గొల్లగూడెం అరుణ్ యాదవ్, ఉత్తరపల్లికి చెందిన లల్లూ యాదవ్ తమ ఇన్‌స్టాగ్రామ్ లో అంబేద్కర్ శివాజీ కాళ్లు మొక్కినట్టు ఫోటోలు క్రియేట్ చేసి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారి, వివిధ సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వెంటనే స్పందించిన దళిత నాయకులు, వివిధ సోషల్ మీడియాల ద్వారా అందరికీ తెలియడంతో పెద్ద ఎత్తున దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు ప్రధాన రహదారి వద్ద ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సంగారెడ్డి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని దళిత సంఘాల నాయకులకు తెలిపారు. అనంతరం ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినటువంటి వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.