తృటిలో తప్పిన ప్రాణాపాయం
తృటిలో తప్పిన ప్రాణాపాయం
విద్యుత్ షాక్‌తో ఇద్దరు బాలికలు అస్వస్థత
కోసిగి, ఆంధ్రప్రభ: మండల కేంద్రమైన కోసిగిలోని ఊరు వాకిలి సమీపంలో నివాసం ఉంటున్న పరంధామ కుమార్తె జాహ్నవికి పక్కింటిలో నివాసం ఉన్నటువంటి కొండగనగేరి నాగార్జున కుమార్తె వర్షినిలు ఆదివారం నాడు మిద్దెపై ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి విద్యుత్ షాక్ తో అస్వస్థతకు గురి అయ్యారు. మిద్దిపై ఆడుకుంటున్న తరుణంలో ఇందులో ఒకరికి విద్యుత్ వైర్లు తగలగా మరొకరు విడిపించడానికి ప్రయత్నించడంతో ఆమె కూడా విద్యుత్ షాక్ కు గురైంది. వెంటనే గమనించిన కుటుంబీకులు వారిని విద్యుత్ షాక్ నుంచి రక్షించి హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించి .మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్ లో ఆ ఇద్దరి బాలికలను ఆదోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిసింది.ఏది ఏమైనప్పటికి తృటిలో ప్రాణాలతో బయట పడడం జరిగిందని కుటింబీకులు ఊపిరి పీల్చుకున్నారు.
