ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత సమాజ నిర్మాణం..

ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత సమాజ నిర్మాణం..

  • రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి..
  • బ్లాక్ స్పాట్స్ గుర్తించి.. ప్రమాదాలు నివారిద్దాం..
  • మాధకద్రవ్యాల నిర్ములనకు కృషి చేద్దాం..
  • ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి..
  • జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

సిరిసిల్ల, ఆంధ్రప్రభ : ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత, శాంతియుత సమాజ నిర్మాణం సాధ్యమని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా గ్రామస్తులతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకొని పలు సూచనలను చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు భద్రత మన అందరి బాధ్యత అని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు ట్రాఫిక్&రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు.

వాహనదారులు తమ స్వీయారక్షణార్ధం,కుటుంబ క్షేమం కొసం తప్పని సరిగా హెల్మెట్ సిట్ బెల్ట్ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నపడం, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయవద్దని,మైనర్ డ్రైవింగ్ పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీలు గ్రామాల్లో ఉన్న రహదారి భద్రతా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న ప్రధాన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి సమన్వయంతో పని చేయాలని తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నివారణలో గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీల పాత్ర కీలకమని తెలిపారు. మహిళలు, యువతులు, బాలికలు జిల్లా షీ టీమ్ సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్కూల్, కాలేజ్, పని చేసే ప్రదేశాల్లో మహిళలు, విద్యార్థినులు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే నిర్భయంగా షీ టీమ్ నంబర్ 87126 56425 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

భరోసా కేంద్రం ద్వారా లీగల్, వైద్య సహాయం, మానసిక కౌన్సెలింగ్ సేవలు అందిస్తారని తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు పోలీసు శాఖకు సహకరిస్తు మాధకద్రవ్యాల నిర్ములనలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ ఉపేందర్ చారి, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply