trisha| తిరుమల టూ విజయ్ హౌజ్

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఇవాళ త్రిష పుట్టినరోజు. తన బర్త్‌డే సందర్భంగా ఆమె తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకున్నారు. తిరుపతి నుంచి తెచ్చిన లడ్డూ ప్రసాదాన్ని విజయ్‌కు అందించి ఎన్నికల్లో ఆయన సాధించిన విజయానికి శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం.
ఒకవైపు విజయ్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుండటం, అదే రోజు త్రిష పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో వీరి గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా వీరిద్దరి వ్యక్తిగత జీవితాల గురించి సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ తన భార్యతో విడిపోతున్నారనే వార్తలు, అందులో త్రిష పేరు రావడం వంటి విషయాలపై నెటిజన్లు ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడుకుంటున్నారు. అయితే వీటిపై అటు విజయ్ గానీ, ఇటు త్రిష గానీ ఇప్పటివరకు ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు.




































