చదువే భవిష్యత్తు నిర్దేశిస్తుంది.

చదువే భవిష్యత్తు నిర్దేశిస్తుంది.

ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.

పాయకాపురం, ఆంధ్ర ప్రభ : చదువే భవిష్యత్తు నిర్దేశిస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు కార్యాలయంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రజల నుండి నేరుగా వినతి పత్రాలు స్వీకరించడం, పలు సమస్యలను అధికారులతో సంప్రదించి వెంటనే పరిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లకు చెందిన పది తరగతి పరీక్షా ఫలితాలలి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. వారికి కాలేజీ బ్యాగులను బహుమతిగా అందజేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, మాజీ కార్పొరేటర్లు,కంచేటి నాగరాజు, డిడి నాయుడు, బుదాల సురేష్,తాడిశెట్టి నాగలక్ష్మి, మెహర్ స్వర్ణాంధ్ర 2047 టీమ్, సచివాలయ సిబ్బంది, అధికారులు, ఎన్డీయే నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

బంగారు భవిష్యత్తు..

పార్టీ బలోపేతానికి కృషి చేసే ప్రతి యొక్క కార్యకర్తలకు బంగారు భవిష్యత్తును టీడీపీ కల్పిస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. క్లస్టర్ ఇంఛార్జి సుర్విపల్లి అమర్నాధ్, డివిజన్ ఇంచార్జి మోతుకూరి ఖాసిమ్ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే బొండా ఉమా సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమా వారితో కలిసి కేక్ కటింగ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పిరియా సోమేశ్వరరావు జగదాంబ, కూర్మపు దుర్గారావు, లబ్బ వైకుంటం, కోలా శ్రీను, ఎరుబోతు రామారావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక59వ డివిజన్లోప్రభుత్వం అందించే ఎన్టీఆర్ పించన్లను డివిజన్ టీడీపీ అధ్యక్షుడు రాజానా బంగారు నాయుడు శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు.స్థానిక 60వ డివిజన్ ప్రాంతంలో ప్రభుత్వం ప్రతినెలా అందించే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను డివిజన్ టీడీపీ అధ్యక్షుడు సూరి, ప్రధాన కార్యదర్శి కంచేటి నాగరాజులు శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు.