పదిలో సత్తా చాటిన విసిహెచ్ స్కూల్..

పదిలో సత్తా చాటిన విసిహెచ్ స్కూల్..
పాయకాపురం, ఆంధ్రప్రభ : విజయవాడ నగర శివారు ప్రాంతం పదో తరగతి పరీక్ష ఫలితాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విజయ దుందిభి మోగించారు. అజిత్ సింగ్ నగర్ ఎమ్. కె బేగ్ హై స్కూల్ పాఠశాల పదో తరగతి విద్యార్థి రహేళ 581మార్కులతో ప్రధమ స్థానం సాధించింది.ఈ సందర్భంగా స్కూల్ ఇంచార్జి ప్రధానోపాధ్యాయుడు మైనం హుస్సేన్ సదరు విద్యార్థిని అభినందించారు.వివేకానంద సెంటర్ హై స్కూల్ ఎస్కే సల్మా 560 మార్కులతో ప్రథమ స్థానం సాధించింది. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో విద్యార్థుల అభినందన కార్యక్రమం నిర్వహించారు.
స్కూల్ కన్వీనర్ పి.అప్పలరాజు,స్కూల్ ప్రధానోపాధ్యాయుల బృందం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ మూర్తిని అభినందించారు.ఈ కార్యక్రమంలో పూర్వఫు ప్రధానోపాధ్యాయుడు ఏవి.రాం ప్రసాద్,నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.వి.సి.హెచ్ ఇంగ్లీష్ మీడియం స్కూలుకు చెందిన లంక అమృత586మార్కులతో ప్రధమ స్థానం సాధించింది.
ఈ సందర్భంగా స్కూల్ కన్వీనర్ పి. అప్పలరాజు, ప్రధానోపాధ్యాయురాలు మాధవీలత సదరు విద్యార్థిని అభినందించారు.కండ్రికలోని బివి సుబ్బారెడ్డి హై స్కూల్ సువ్వాడ రాజశ్రీ 576మార్కులతో ప్రధమ స్థానం పొందింది. ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు దుర్గాప్రసాద్ సదరు విద్యార్థిని అభినందించారు.లహరి వైద్య మందిర్ స్కూలుకు చెందిన జ్యోస్న 588 మార్కులతో ప్రధమ స్థానం సాధించింది.ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ ఏ. మోహన్ రెడ్డి సదరు విద్యార్థిని అభినందించారు మ్
