మండల టాపర్ గా నిలిచిన కేజీబీవీ విద్యార్థిని..

మండల టాపర్ గా నిలిచిన కేజీబీవీ విద్యార్థిని..
జుక్కల్ మండలంలో పదవ తరగతిలో 90.12 శాతం ఉత్తీర్ణత
జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలో గత సంవత్సరం కన్నా ఈసంవత్సరంలో పదవ తరగతిలో ఉత్తీర్ణతశాతం పెరిగింది.మండలంలో ఐదు హైస్కూల్, ఒక కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన మొత్తం 324 మంది విద్యార్థిని,విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయగా అందులో 292 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.90.12 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు జుక్కల్ విద్యాశాఖ అధికారి తిరుపతయ్య తెలిపారు.
కేజీబీవీకి చెందిన విద్యార్థిని కే.మమత 542 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలువగా,జుక్కల్ హై స్కూల్ కు చెందిన విద్యార్థిని జి. ముక్తేశ్వరి 540 మార్కులు సాధించి మండలంలో రెండవ స్థానం సంపాదించటంతో ఇరువురు విద్యార్థిలకు జుక్కల్ మండల ప్రత్యేక అధికారి జడ్పీ సీఈవో చందర్ నాయక్,విద్యాశాఖ అధికారి తిరుపతయ్యతో పాటు జుక్కల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు హన్మంత్ రెడ్డి,కేజీబీవీ నిర్వాహకురాలు హేమలత, ఉపాధ్యాయ బృందం,ప్రజాప్రతినిధులు మండల ప్రజలు అభినందించారు.

