5stateselections | ఇంధన ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన

5stateselections | ఇంధన ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన
5stateselections | వదంతులపై కేంద్రం ‘కీలక ప్రకటన’
ఎలక్షన్ ఫ్యాక్టర్ వెనుక రాజకీయ లెక్కలు
చమురు సంస్థల నష్టాలు – అసలు సత్యం ఏంటి?
ఎన్నికల తర్వాత ధరల ‘షాక్’ భయం
సామాన్యుడికి తాత్కాలిక ఊరట మాత్రమేనా?
5stateselections | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నిత్యావసర వస్తువుల ధరలు, పెరుగుతున్న జీవన వ్యయంతో సతమతమవుతున్న సామాన్యుడికి కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు చెప్పింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, ఇతర మాధ్యమాల్లో వస్తున్న వార్తలను కేంద్ర పెట్రోలియం శాఖ తాజాగా ఖండించింది. ఇంధన ధరల పెంపు ప్రతిపాదనే ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేసింది. అయితే, ఈ ప్రకటన వెనుక ఉన్నది నిజంగా సామాన్యుడిపై ప్రేమా? లేక ‘ఎన్నికల’ భయమా? అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
5stateselections |వదంతులు నమ్మవద్దు – కేంద్రం స్పష్టత:
గత నాలుగేళ్లుగా భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచగలిగామని కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, ఆ భారం సామాన్యుడిపై పడకుండా ప్రభుత్వం రక్షణ కవచంలా నిలిచిందని పేర్కొంది. ప్రస్తుతం ఇంధన ధరలు పెరుగుతాయని వస్తున్న వార్తలు కేవలం వదంతులుేనని, వాటిని ఎవరూ నమ్మవద్దని కొట్టిపారేసింది.
అంతా ‘ఎలక్షన్’ మ్యాజిక్కేనా?
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మండుతున్న సమయంలో, ఆ భారాన్ని చమురు సంస్థలు భరించడం ఆర్థికంగా క్లిష్టమైన విషయమే. తీవ్రమైన నష్టాలు తమను వెన్నాడుతున్నాయని ఇప్పటికే చమురు సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. కానీ, సరిగ్గా ఎన్నికల సీజన్ నడుస్తున్న తరుణంలో ధరలు పెంచితే, అది అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకతకు దారి తీస్తుందనేది జగమెరిగిన సత్యం. పెట్రోల్ ధర పెరిగితే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతాయి, అది సామాన్య ఓటరును ఆగ్రహానికి గురిచేస్తుంది. అందుకే, ప్రతిపక్షాలకు ఎలాంటి విమర్శనాత్మక ఆయుధం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం హుటాహుటిన ఈ ఖండన ప్రకటన చేసిందనేది రాజకీయ విశ్లేషకుల విశ్లేషణ.
ఎన్నికల ముగిశాక ‘మళ్ళీ వడ్డన’ తప్పదా?
ప్రస్తుతానికి పెంచడం లేదని ప్రభుత్వం చెబుతున్నా.. ప్రజల్లో మాత్రం ఒక బలమైన అనుమానం మెదులుతోంది. “సరే, ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పెంచలేదు.. మరి ఓట్లు పడిపోయాక ముక్కు పిండి వసూలు చేయరా?” అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల అనుభవాలను పరిశీలిస్తే ఈ అనుమానాల్లో నిజం లేకపోలేదు. అనేక సందర్భాల్లో రాష్ట్ర లేదా జాతీయ ఎన్నికల సమయంలో ఇంధన ధరలను స్థిరంగా ఉంచిన ప్రభుత్వాలు, ఫలితాలు వచ్చిన వెంటనే ఏకబిగిన ధరలను పెంచిన దాఖలాలు ఉన్నాయి.
ఏది ఏమైనా, దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణం దృష్ట్యా ఇంధన ధరల పెంపు లేదన్న వార్త వాహనదారులకు తాత్కాలికంగా పెద్ద ఊరటే అని చెప్పాలి. మరి ఈ ‘ప్రేమ‘ జూన్ తర్వాత కూడా కొనసాగుతుందో లేదో వేచి చూడాలి!
click here to read తమిళనాడులో ఎన్నికల పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
