Shock | కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్…

Shock | కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్…

Shock | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధికారికంగా భారత రాష్ట్ర సమితి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం జగిత్యాలలో బీఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన గులాబీ గూటికి చేరారు.

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు వేదికపై ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. సీనియర్ నేత రాకతో అటు సభలో, ఇటు స్థానిక బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్సాహం నెలకొంది

Leave a Reply