ప్రజలకు ఇబ్బంది కలిగించే మట్టితో కూడిన ప్లైఓవర్ వద్దు

ప్రజలకు ఇబ్బంది కలిగించే మట్టితో కూడిన ప్లైఓవర్ వద్దు

పిల్లర్లతో కూడిన ప్లైఓవర్ ఎలివేటర్ కారిడార్ నిర్మించాలి
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలో జాతీయరహదారి 65 విస్తరణలో భాగంగా నిర్మించ తలపెట్టిన మట్టితో కూడిన ప్లైఓవర్ కాకుండా పిల్లర్లతో కూడిన ప్లైఓవర్ ఎలివేటర్ కారిడార్ నిర్మించాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. చౌటుప్పల్ పట్టణంలో చేస్తున్న జాతీయ రహదారి విస్తరణ పనులను ఆదివారం ప్రభాకర్ రెడ్డి స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు, ప్రయాణికులకు, వ్యాపారులకు ఇబ్బంది కలిగించే మట్టితో కూడిన బ్రిడ్జి నిర్మాణాన్ని నిరసిస్తూ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, వ్యాపార రంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చౌటుప్పల్ పట్టణంలో ఆర్ ఈ వాల్స్, వియూపి లు అవసరం లేదని, జాతీయ రహదారిపై మాత తహసిల్దార్ కార్యాలయం (టిడిపి ఆఫీస్) వలిగొండ క్రాస్ రోడ్ విద్యుత్ సబ్ స్టేషన్ వరకు పూర్తిగా పిలర్లపై ఎలివేటెడ్ కారిడార్ (పిల్లర్ బ్రిడ్జ్) నిర్మించాలని, పట్టణంలో రాకపోకలకు అంతరాయం లేకుండా, వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగేందుకు, చౌటుప్పల్ బస్టాండ్ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా సరైన ప్లానింగ్‌తో రహదారి సౌకర్యాలు కల్పించాలని, అలా కాకుండా ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా నిర్మాణాలు చేపడితే తాము అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి పెద్దిటి బుచ్చిరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్, మున్సిపల్ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు సుర్వి మల్లేష్ గౌడ్, నాయకులు ఢిల్లీ మాధవరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ కొయ్యడ శేఖర్, సిపిఎం నాయకులు బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాష, బత్తుల శ్రీశైలం గౌడ్, తడక నర్సింహా, బీఆర్ఎస్ నాయకులు ఊడుగు మల్లేశం గౌడ్, ఎం దయాకరాచారి, సుర్కంటి శ్రీనివాస్ రెడ్డి, చిన్నం బాలరాజు, సురుకంటి శంకర్ రెడ్డి, కైరంకొండ వెంకట నరసయ్య, క్లాత్ అసోసియేషన్ అధ్యక్షులు కర్నాటి శ్యాంప్రసాద్, మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రతాపరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు, వ్యాపారస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply