పేకాట శిబిరంపై పోలీసుల మెరుపుదాడి…

పేకాట శిబిరంపై పోలీసుల మెరుపుదాడి…
– నలుగురు మహిళలు సహా ఆరుగురి అరెస్ట్
పెడన – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా పెడన పట్టణ పరిధిలోని డీటీ పాలెం నందు గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా సాగుతున్న పేకాట స్థావరంపై పెడన ఎస్ఐ షేక్ బషీర్ తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి నిర్వహించారు.
నలుగురు మహిళలతో పాటు ఇద్దరు పురుషులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 47,750 నగదును స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
