మద్దూర్‌లో రేషన్ బియ్యం అక్రమ దందా

మద్దూర్‌లో రేషన్ బియ్యం అక్రమ దందా
- వేకువజాము నుంచే దందా కొనసాగింపు
- ఉమ్మడి మండలంలో జోరుగా సాగుతున్న బియ్యం అక్రమ వ్యాపారం
- రేషన్ డీలర్లు, వ్యాపారుల కుమ్మక్కు
- డీలర్ల సహకారంతో నేరుగా రేషన్ షాప్‌ల నుంచే డంపింగ్
- అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో..
- రేషన్ బియ్యం పక్కదారి
మద్దూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వాలు పేదలందరికీ సబ్సిడీపై ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరుకు లు సరఫరా చేస్తోంది. ఇదే అదును గా భావించి అక్రమార్కులు రెచ్చిపోయి మరీ రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో అక్రమార్కులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కొత్తపల్లి, మద్దూర్ మండలాలలో ఈ అక్రమ వ్యాపారం జోరుగా కొనసాగుతోంది.

పేదలకు అందించాల్సిన బియ్యం రేషన్ డీలర్లు పక్కదారి పట్టించి వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. సాయంత్రం నుంచి వేకువ జామునే ఎవరి కంట పడకుండా బియ్యం వ్యాపారులు డీసీఎం, టాటా ఎస్, ఆటో వాహనంలో జోరుగా అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. శుక్రవారం వారం పెద్దాపూర్ గ్రామంలో గాన్ని బ్యాగ్స్ లలో అక్రమంగా రేషన్ తరలిస్తుంటే గ్రామస్థులు అడ్డుకొని పోలీసులకి అప్పచెప్పడం తో రేషన్ డీలర్ పై మరో ఇద్దరు వ్యక్తుల పై కేసు నమోదు కావడం జరిగింది.
రేషన్ దుకాణాల నిర్వా హకులు ప్రతీ నెల పేదలకు పంచాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఇలా క్వింటాళ్ల కొద్ది రహస్య స్థావరాల్లో నిల్వ చేసి వ్యాపారులకు అధిక ధరలకు విక్రయించుకుంటున్నారు. రేషన్ బియ్యం పక్కదారి పడుతుంటే అడ్డుకోవాల్సిన అధికారులు, అక్రమార్కులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెలువెత్తున్నాయి.రేషన్ అక్రమ రవాణా దందా మూడు పువ్వులు..ఆరు కాయలుగా కొనసాగుతున్నది.
సంచులు మార్చకుండానే..
వాహనంలో రేషన్ బియ్యం ఉన్నాయి. ఉమ్మడి మద్దూర్ మండలంలోని నిరుపేదల కోసం కేటాయించిన ఈ రైస్‌ను ఎంఎల్ఎల్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు చేరిన తర్వాత లబ్ధిదారులకు పంచాలి. కానీ, ఈ నెల 17న మద్దూర్ కు తరలిస్తుండగా గ్రామస్థులు పట్టుకొని పోలీసులు పోలీస్ లకు ఆప్పగించారు. ప్రభుత్వ సంచుల్లోనే పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తుండడాన్ని చూసి ప్రజలు విస్తుపోయారు. ఈ రైస్ నేరుగా రేషన్ దుకాణం నుంచే బయటికి రావడం దందా ఏ స్థాయిలో నడుస్తుందో నిదర్శనంగా నిలుస్తున్నది.
రెక్కలు విప్పుతున్న “రేషన్ బియ్యం” దందా..?
రేషన్ దందాను అరికట్టడానికి రేషన్ దుకాణాల్లో ఈ పాస్, బయోమెట్రిక్ విధానం అమల్లోకి వచ్చినా ఫలితం లేకుండా పోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ దందాను అరికట్టాల్సిన సంబంధిత అధికారులు మొక్కుబడి దాడులు చేస్తున్నారే తప్ప నిర్థిష్టమైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలో రేషన్ బియ్యం దందా రెక్కలు విప్పుతుందనేది బహిరంగ రహస్యమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనప్పటికీ రేషన్ బియ్యం అక్రమ దందాను ఆ మండలంలో సంబంధిత అధికారులు కట్టడి చేయడంలో విఫలమవుతున్నారనే ఆరోపణల్లో నిజం లేకపోలేదు.పేదల ఆకలి తీర్చాలనే ఆశయంతో పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. సివిల్ సైప్లె శాఖలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్నదని పలువురు భావిస్తున్నారు.
రేషన్ డీలర్లు, పౌరసరఫరాల శాఖ అధికారుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు..
రేషన్ దుకాణాలలో అమాయక ప్రజలతో తక్కువ ధరకు రేషన్ బియ్యం కోరుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నట్లు ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్న. అధికారులు రేషన్ దుకాణాలలో తనిఖీలు అందుకే చేయడం లేదా అన్ని ప్రజల నుంచి అనుమానులు వ్యక్తం అవుతున్నాయి. మద్దూర్ మండలంలో రోడ్లు పైనే దందాలు చేస్తున్న అధికారులకు కనిపించడం లేదా..? రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకట్ట వేయడానికి,పేదవారు సైతం దొడ్డు బియ్యం తినడం లేదని సన్న బియ్యం పంపిణీ చేస్తున్న అక్రమంగా పక్కదారి పట్టించి ప్రభుత్వ సొమ్ముకు గండీ కొడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు ప్రభుత్వం స్పందించి అక్రమ రేషన్ బియ్యం అడ్డుకట్ట వేసి పేద ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
