టిడిపి పార్టీ సంస్థాగతంగా బలోపేతం…

టిడిపి పార్టీ సంస్థాగతంగా బలోపేతం…

కార్యకర్త అధినేత..
పొలిట్ బ్యూరో గా గ్రామస్థాయి నుంచి పార్టీ మరింత బలోపేతం…
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి…

నంద్యాల బ్యూరో ఏప్రిల్ 17 ఆంధ్రప్రభ : రాష్ట్రంలో టిడిపిపార్టీకి నూతన శకం ప్రారంభమైంది. 44 వసంతాలు పూర్తి చేసుకున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కోసం గ్రామ గ్రామాన వాడవాడలా వీధి వీధిలో కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపి రాబోయే ఎన్నికల్లో జయ సంకేతం చేయాలని కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపే ప్రణాళికలు రూపొందించాలని జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా లోకేష్ రాష్ట్రస్థాయిలో పోలీస్ బ్యూరో సభ్యుడిగా ఎంపికైన రాష్ట్ర ఆర్ అండ్ బి మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డికి సూచించారు. శుక్రవారం టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన నారా లోకేష్ కు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అభినందనలుతెలిపారు.

ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి. టీడీపీ నూతన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన లోకేష్ కు శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేసి, ఆత్మీయ అభిననందనలు తెలిపారు.తెలుగుదేశం పార్టీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పొలిట్ బ్యూరోలో తనకు అవకాశం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేసిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి. జిల్లా వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పటిష్టతకు మంత్రి ఎంతో కృషి చేశారని బిసిని కొనియాడారు జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా లోకేష్.

Leave a Reply