Ponnam | అడ్డగోలుగా మాట్లాడితే ఖబడ్దార్

Ponnam | అడ్డగోలుగా మాట్లాడితే ఖబడ్దార్

Ponnam | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని, అలాగే సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడం అజ్ఞానమని మంత్రి విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలను సమర్థించే వారు మూర్ఖులని తీవ్రంగా విమర్శించిన ఆయన, తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుపై అడ్డగోలుగా మాట్లాడితే ఖబడ్దార్ అని ఘాటుగా హెచ్చరించారు.

Leave a Reply