నో హెల్మెట్.. నో ఏంట్రీ!

సూర్యాపేట, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్ బంకులు, వ్యాపార కేంద్రాలు, కలెక్టరేట్లు, కార్యాలయాల్లో హెల్మెట్ లేకుంటే నో ఎంట్రీ బోర్డులు పెట్టి అవగాహన కల్పిస్తుండగా గ్రామాలకు వచ్చే వ్యక్తులు గ్రామస్తులు సైతం హెల్మెట్ ధరిస్తేనే లోపలికి రావాలని ఎంట్రీ బోర్డులు పెట్టి రోడ్డు భద్రతా నియమాలపై చైతన్యం చేస్తున్నారు.

ప్రజాపాలన ప్రగతిప్రణాళిక లో భాగంగా పోలీసుల నిర్వహిస్తున్న ఆరైవ్ అలైవ్ రోడ్డుభద్రత కార్యక్రమాల పట్ల నాగారం పోలీస్ స్టేషన్ పరిధి ఈటురు, ఫణిగిరి గ్రామాల ప్రజలు ఏకతాటిపై వచ్చి గ్రామ శివారులో #NoHelmet_NoEntry, హెల్మెట్ లేకుండా ఎవరు కూడా గ్రామంలోకి రాకూడదని గురువారం ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. #అరైవ్_అలైవ్ రోడ్డు భద్రతా ఉద్యమ కార్యక్రమాలలో భాగంగా ప్రజలలో చైతన్యం కలిగి గ్రామాలు తీర్మానాలు చేసుకుంటున్నాయి.

Leave a Reply