ఓవర్ లోడ్ కంకర లారీల పై పోలీసుల కొరడా

ఓవర్ లోడ్ కంకర లారీల పై పోలీసుల కొరడా

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఓవర్ లోడుతో వెళ్తున్న కంకర లారీల పై ఇబ్రహీంపట్నం పోలీసులు గురువారం ఉదయం కొరడా ఝళిపించారు. మండల పరిధిలోని క్రషర్ల నుంచి ఓవర్ లోడుతో అధిక వేగంతో పట్టాలు కప్పుకు వెళ్తున్న 17 కంకర లారీలను ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో పోలీసులు పట్టుకున్నారు. లారీ యజమానులు, డ్రైవర్లకు పనిష్మెంట్ గా మొత్తం లారీలను పోలీసులు నిలిపివేశారు. ఓవర్ లోడు, అధిక వేగం వద్దని గతంలో అవగాహన సదస్సులు నిర్వహించారు. లారీ, క్రషర్ యజమానులు, డ్రైవర్ల తీరు మారలేదు. ఓవర్ లోడ్ అధిక వేగం వల్ల కంకర రోడ్డు పై పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం చర్యలకు ఉపక్రమించారు.

Leave a Reply