కొండాపూర్‌లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ

కొండాపూర్‌లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
చిలుపూర్, ఆంధ్రప్రభ : చిలుపూర్ మండలం కొండాపూర్ గ్రామంలో డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామస్తులు మంగళవారం విష్కరించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గుగులోతు దేవేందర్, ఉప సర్పంచ్ లింగనబోయిన నరేష్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మోతే కొమురయ్య, మోతే చంద్రమౌళి పాల్గొనగా, వార్డ్ సభ్యులు లింగనబోయిన మహేష్, ఉప్పరి గణేష్, గాలి రాజు, ఉప్పరి ప్రియాంక, మరబోయిన రత్న, మోతే ఉమ కూడా హాజరయ్యారు.
అదేవిధంగా మాజీ సర్పంచ్ రజిత రవీందర్, మాజీ ఎంపిటిసి అయిలమ్మ ఎల్లయ్య, గ్రామ నాయకులు గాలి ప్రవీణ్, బానోతు కీమన్, జోడుముంతల అరుణ శోభా, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు డా. అంబేద్కర్ సేవలను కొనియాడుతూ, ఆయన ఆలోచనలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
