విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి

విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. పట్టణంలోని మల్లికార్జున ఒలంపియాడ్ స్కూల్ లో మంగళవారం గ్రాడ్యువేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్ చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నేటి బాలలే రేపటి బావి భారతం పౌరులని, చిన్నతనం నుండే పట్టుదలతో కృషి చేస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకుంటారని, చిన్నపిల్లలకు క్రమశిక్షణ, ఉన్నత విలువలతో కూడిన విద్యని అందించడం ద్వారా సమాజంలో ఉన్నత పదవులలో ఉండి సమాజానికి సేవ చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, ఎంఈఓ గురువారావు, మల్లికార్జున హైస్కూల్ చైర్మన్ మారపల్లి మల్లారెడ్డి, డైరెక్టర్లు భీమిడి ధరణి, మారెపల్లి తేజస్విని, ప్రిన్సిపాల్ కన్నయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
