Parliament | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Parliament | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Parliament | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అంశాలపై కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈనెల 16న ఈ రెండు బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది.

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ అంశాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16న ఈ రెండు బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ బిల్లుల ప్రతులను ఎంపీలకు పంపుతోంది.

కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ఇది 131వ రాజ్యాంగ సవరణగా మారనుంది.

ఈ బిల్లులో భాగంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల సీట్ల పునర్విభజన చేపట్టనున్నారు. ఎంపీ సీట్ల సంఖ్య 815 వరకు పెరిగే అవకాశం ఉండగా, కేంద్ర పాలిత ప్రాంతాల సీట్లు 35కు మించకుండా ఉండేలా ప్రతిపాదనలు ఉన్నాయి.

ఇదే చట్టం ప్రకారం కేంద్రం ఒక నియోజకవర్గాల కమిషన్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ కమిషన్‌కు సుప్రీంకోర్టు జడ్జి స్థాయి వ్యక్తిని ఛైర్మన్‌గా నియమించనుండగా, సభ్యులుగా సీఈసీ లేదా ఆయన ప్రతినిధి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ఉండనున్నారు. జనాభా లెక్కల ఆధారంగానే సీట్ల కేటాయింపు జరగాలని బిల్లులో పేర్కొన్నారు.

Leave a Reply