Singer | సీపీని కలిసిన గాయని మంగ్లీ

Singer | సీపీని కలిసిన గాయని మంగ్లీ

Singer | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రముఖ గాయని మంగ్లీ తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై హైదరాబాద్ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

ప్రముఖ గాయని మంగ్లీ హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

ప్రత్యేకంగా అడ్వకేట్ సుబ్బారావు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంలో తనతో పాటు ఇతర బాధితులకు కూడా న్యాయం చేయాలని పోలీసులను అభ్యర్థించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని మంగ్లీ కోరినట్లు సమాచారం.

Leave a Reply