Kayadhu lohar | టార్గెట్ ఇదే..

Kayadhu lohar | టార్గెట్ ఇదే..
Kayadhu lohar | సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కయాదు
కయాదు కెరీర్ టర్నింగ్ పాయింట్
టాప్ హీరోయిన్ కావాలన్న కయాదు లక్ష్యం
Kayadhu lohar | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కయాదు లోహర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. ఒక్క టాలీవుడ్ లోనే కాదు.. సౌత్ ఇండస్ట్రీలో గట్టిగా సౌండ్ చేస్తుంది ఈ అమ్మడు. తెలుగులో ఇటీవల కయాదు నటించిన ఫంకీ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. అయినప్పటికీ ఈ అమ్మడు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే.. ఇంకా బ్యూటీ క్రేజ్ పెరుగుతుంది. ఇంతకీ.. కయాదు చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయి. కయాదు టార్గెట్ ఏంటి..?

Kayadhu lohar | సోషల్ మీడియాని షేక్ చేస్తున్న కయాదు..
ఒకప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూసిన ఈ అందాల భామ, ఇప్పుడు స్టార్ దర్శకులు, నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎదురుచూసే స్థాయికి ఎదిగింది. అస్సాం నుంచి వచ్చి తక్కువ టైమ్ లోనే సౌత్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు టాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. దీంతో కయాదు క్రేజ్ వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ గురించి ఏ వార్త వచ్చినా వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విధంగా సోషల్ మీడియాను షేక్ చేస్తూ.. వార్తల్లో ఉంటుంది.

Kayadhu lohar | కయాదు టర్నింగ్ పాయింట్..
కయాదు లోహర్ కెరీర్ గురించి చెప్పాలంటే.. డ్రాగన్ మూవీ కయాదు కెరీర్ లో టర్నింగ్ పాయింట్. ఇంకా కయాదు గురించి చెప్పాలంటే.. డ్రాగన్ సినిమాకు ముందు, ఆ తర్వాత అని చెప్పచ్చు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ అయ్యింది. అందులో ఆమె నటనకు యూత్ నుంచి మంచి స్పందన లభించింది. అప్పటి వరకు పెద్దగా గుర్తింపులేని ఈ బ్యూటీ ఒక్కసారిగా అందరి దృష్టిలో పడింది. ఈ చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపు కారణంగా కయాదుకి మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం సౌత్‌లో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది.

Kayadhu lohar | కయాదు టార్గెట్ ఇదే..
సాధారణంగా ఒక హీరోయిన్ చేతిలో రెండు లేదా మూడు సినిమాలు ఉండటం గొప్పగా భావిస్తారు. కానీ కయాదు ఖాతాలో ప్రస్తుతం ఏకంగా ఏడు సినిమాలు ఉండటం విశేషం. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, మలయాళ భాషల్లో కూడా వరుసగా ప్రాజెక్టులు చేస్తుంది. భాషతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ బిజీగా ఉంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకోవడం ద్వారా తన ఇమేజ్‌ను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఇప్పుడు ఈ అమ్మడు టాప్ హీరోయిన్ అవ్వడమే లక్ష్యంగా కెరీర్ ను మలుచుకుంటుది. నాని ప్యారడైజ్ మూవీలో నటిస్తుంది. ఈ సినిమా విజయవంతమైతే టాలీవుడ్‌లో కయాదు స్థాయి మరింత పెరగడం ఖాయం.


