మీ భూమి – మీ హక్కు…

మీ భూమి – మీ హక్కు…

బాపట్ల జిల్లాలో కొత్త శకానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి

బాపట్ల కలెక్టరేట్, ఆంధ్రప్రభ : బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలం సూరేపల్లె గ్రామంలో గురువారం నిర్వహించిన మీ భూమి – మీ హక్కు గ్రామ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గ్రామ సభ వద్ద ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల స్టాల్స్‌ను సందర్శించి, రెవెన్యూ రికార్డుల ప్రదర్శనను నిశితంగా పరిశీలించారు. భూ హక్కుల పరిరక్షణలో పారదర్శకతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పిస్తూ ఈ కొత్త పాసు పుస్తకాలను అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ అధికారిక రాజముద్రతో ముదిరించిన నూతన పట్టాదార్ పాస్ పుస్తకాలను ముఖ్యమంత్రి స్వయంగా రైతులకు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు.

వీరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, సీసీఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతులందరికీ భూ హక్కులపై భరోసా కల్పిస్తూ, ఈ కార్యక్రమం బాపట్ల జిల్లాలో విజయవంతంగా నిర్వహించబడింది.

Leave a Reply